ఎన్టీఆర్ 'డ్రాగన్' సెట్స్‌లో బాలీవుడ్ నటుడు?
జూ.ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' మూవీని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ విలన్‌గా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన ఈ మూవీ సెట్స్‌లో అడుగుపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ మూవీని 2026 జూన్ 25న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.