GREAT.. వాగు దాటి వైద్య సేవలు!

MLG: గ్రామాల్లో సాధారణంగా అధికారులు వైద్య శిబిరాలు నిర్వహిస్తుంటారు. కానీ, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని గుత్తికోయగూడెంలో మాత్రం జంపన్నవాగు దాటి సుమారు 2 కి.మీ నడిచి వైద్య శిబిరం నిర్వహించారు. గూడెంలోని ప్రజలను పరీక్షించి మందులు పంపిణీ చేశారు. 28 మందిని పరీక్షించగా.. ఒకరికి మలేరియా నెగిటివ్ రిపోర్టు వచ్చిందని డా. ప్రణీత్ కుమార్ తెలిపారు.