పర్యావరణంపై ఈశ్వర్ ఆర్ట్స్ సేవలు ప్రశంసనీయం

SKLM: పర్యావరణ పరిరక్షణకు ఈశ్వర్ ఆర్ట్స్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయం సమావేశ మందిరంలో ఈశ్వర్ ఆర్ట్స్ డిజిటల్ 25వ వార్షికోత్సవం సందర్భంగా ఈశ్వర్ ఆర్ట్స్ నిర్వాహకులు ఎస్ ఈశ్వర్.. తల్లి హేమలత జ్ఞాపకార్థం విద్యార్థులకు పర్యావరణంపై వివిధ పోటీలు నిర్వహించారు.