విద్యుత్ బిల్లు చూసి అవాక్కు

విద్యుత్ బిల్లు చూసి అవాక్కు

KDP: కమలాపురం పట్టణం తెలుగు వీధిలో నివసించే గంగాదేవి కుటుంబానికి సాధారణంగా ప్రతి నెల రూ. 200 నుంచి రూ. 500 మధ్య విద్యుత్ బిల్లు వచ్చేది. అయితే ఈసారి ఏకంగా రూ. 21,932 బిల్లు రావడంతో వారు షాక్‌కు గురయ్యారు. ఈ విషయంపై విద్యుత్ శాఖ అధికారులు స్పందించి, బిల్లు సరిచేసి మున్ముందు ఇలాంటి తప్పిదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.