సింహాచలంలో బయటపడుతున్న తప్పిదాలు..!

AP: సింహాచలం ఘటనలో తప్పిదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. టూరిజం, ఆలయ ఈఈలు ఆగమశాస్త్రం, వైదిక సూచనలను పాటించలేదని తెలుస్తోంది. పండితులు సూచించినా.. వారి మాట వినకుండా ప్రసాద్ స్కీమ్‌లో పనులు చేపట్టారు. తరతరాలుగా అప్పన్న మాడవీధుల్లో తిరుగుతూ సొరంగ మార్గం నుంచి పుష్కరిణికి వెళ్లే దారిని మూసివేస్తూ గోడ నిర్మించారని పండితులు తెలిపారు. ఇప్పుడు ఆ గోడే కూలిపోయింది.