మళ్లీ నోరు పారేసుకున్న ట్రంప్ వాణిజ్య సలహాదారు

భారత్‌పై ట్రంప్ సలహాదారుడు పీటర్ నవారో సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండటంపై ఆయన మరోసారి భారత్‌పై నోరు పారేసుకున్నారు. అమెరికాతో వాణిజ్య చర్చలపై భారత్ ఏదో ఒక సమయంలో దిగొస్తుందన్నారు. తమ దారికి రావాల్సిందేనని పేర్కొన్నారు. అలా కాకుండా రష్యా, చైనాలతో పొత్తు పెట్టుకోవాలనుకుంటే భారత్‌కు మంచి ముగింపు ఉండదని హెచ్చరించారు.