నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న మంత్రి
అనకాపల్లి: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బుధవారం ఉదయం అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మంత్రి అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు.