VIDEO: రూ.100 కోట్లతో జార్విస్ ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్
E.G: రాజమండ్రి అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని జార్విస్ ఏవియేషన్ అకాడమీ రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. మంత్రి లోకేశ్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అందించిన సహకారం కీలకమని పేర్కొన్నారు. ఫ్లైట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు ద్వారా పైలట్ శిక్షణతో పాటు 500 మందికి పైగా ఉపాధి కలుగనున్నట్లు వెల్లడించారు.