బాల్య వివాహ ముక్తి భారత్‌పై అవగాహన సదస్సు
KNR: ఖర్ఖనగడ్డ ప్రభుత్వ పాఠశాలలలో బాల్య వివాహ ముక్తి భారత్‌పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ దుర్దన పర్వీన్, సిబ్బంది నాయిని స్వప్న, పాఠశాల హెడ్ మాస్టర్ నంది శ్రీనివాస్ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. చట్టబద్ధంగా అమ్మాయి వివాహ వయస్సు 18, అబ్బాయి వివాహ వయస్సు 21 ఏళ్ల తర్వాత మాత్రమే పెళ్లి చేసుకోవాలని అన్నారు.