రేపు ఢిల్లీకి వెళ్లనున్న మంత్రి లోకేష్
AP: మంత్రి లోకేష్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్‌ను కలవనున్నారు. విద్య, ఐటీ సంబంధిత అంశాలతో పాటు రాష్ట్ర సమస్యలపై కేంద్రమంత్రులతో చర్చించనున్నారు. అలాగే, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను లోకేష్ కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, 16న ఢిల్లీ నుంచి విశాఖకు చేరుకోనున్నారు.