రోడ్డు ప్రమాదం.. ఐదుగురికి గాయాలు
NDL: అవుకు పట్టణ సమీపంలో ఇవాళ లారీ ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటన చోటు చేసుకుంది. అయితే రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలం చేరుకొని వివరాల వెల్లడించారు. ఈ మేరకు అవుకు నుంచి తాడిపత్రికి ఆర్టీసీ బస్సు వెళుతుండగా లారీ వేగంగా వచ్చి ఎదురుగా బస్సును ఢీకొట్టడంతో ప్రయాణికులు గాయపడ్డ బాధితులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.