VIDEO: ఓవర్ స్పీడ్ కారణంగా ట్రాక్టర్ బోల్తా
KMM: ఓవర్ స్పీడ్ కారణంగా ఇసుకతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటన మధిర మండలం వెంకటాపురం క్రాస్ రోడ్ వద్ద సోమవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడగా, సమీపంలో ఉన్న వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు.