కడుపు నొప్పి భరించలేక మహిళా సూసైడ్
ప్రకాశం: టంగుటూరు మండలం కారుమంచి గ్రామానికి చెందిన వివాహిత వహీదా(26) తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ శుక్రవారం ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను ఒంగోలులోని ప్రకాశం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై నాగమల్లేశ్వరరావు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పెద్ద ఆసుపత్రులలో చూపించలేకపోయినట్లు కుటుంబ సభ్యలు తెలిపారు.