వర్షాకాలంలో జాగ్రత్తలు తీసుకోండి: సూపరింటెండెంట్

వర్షాకాలంలో జాగ్రత్తలు తీసుకోండి: సూపరింటెండెంట్

RR: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని చేవెళ్ల ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డా. రాజేంద్రప్రసాద్ సూచించారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా జ్వరాలు దోమలతో విస్తరిస్తాయని, వాటి బారి నుంచి కాపాడుకోవాలని కోరారు. ఇంటి కిటికీలు మూసుకోవాలని, ఇళ్లల్లో నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. కాచి వడబోసిన నీటిని తాగాలని తెలియజేశారు.