ఏ ఎస్ పేటలో గంధ మహోత్సవానికి తరలివచ్చిన భక్తులకు తీవ్ర ఇబ్బందులు

నెల్లూరు; జిల్లా ఏఎస్ పేటలో గంధమోత్సవం సందర్భంగా భారీగా భక్తులు తరలివస్తున్నారు. అయితే బస్సులను దర్గాకు కిలోమీటర్ల దూరంలో పోలీసులు నిలిపివేస్తున్నారు. దీంతో భక్తులు దర్గా వరకు నడిచే రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసుల తీరుపై యాత్రికులు మండిపడుతున్నారు. పోలీసు ఉన్నతాధికారుల స్పందన సైతం సరిగా లేదంటున్నారు.