VIDEO: భిక్కనూర్‌లో నామినేషన్ల కోసం క్యూలైన్
KMR: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు శనివారం చివరి రోజు కావడంతో భిక్కనూర్‌లోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి టోకెన్ సిస్టం ఏర్పాటు చేశారు. నామినేషన్ దాఖలు కోసం అభ్యర్థులు పడిగాపులు కాస్తున్నారు.