ఈనెల 12 ప్రజా ప్రతినిధులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు
MNCL: 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక'కి సంబంధించి ఈనెల 12 ప్రజా ప్రతినిధులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంచిర్యాల జిల్లాలోని సర్పంచ్, ఉప సర్పంచ్, మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్లకు అవగాహన కల్పించనున్నారు. దీనికి సంబంధించి అన్ని శాఖల అధికారులు సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉండాలన్నారు.