శ్రీరామ్‌ను సత్కరించిన సహకార సంఘ ఛైర్మన్

సత్యసాయి: ధర్మవరం రూరల్ మండలం గొట్లూరు సహకార సంఘం ఛైర్మన్‌గా మేకల రామాంజనేయులు నియమితులయ్యారు. ఈ సందర్భంగా మండల నాయకులతో కలిసి ఆయన ధర్మవరం నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త పరిటాల శ్రీరామ్‌ను కలిశారు. పూలమాల, శాలువాతో సత్కరిచారు. శ్రీరామ్ మాట్లాడుతూ.. పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందని చెప్పారు. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పనిచేయాలని సూచించారు.