భద్రకాళీ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ
WGL: మార్గశిర మాసం సందర్భంగా వరంగల్ భద్రకాళి అమ్మవారికి అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక అలంకరణ పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు వేకువజామున నుంచే ఆలయానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. భక్తులు అమ్మవారికి మంగళ హారతులు ఇచ్చి నైవేద్యం సమర్పించారు. ఆలయ పరిసరాలు భక్తులతో సందడి నెలకొంది.