లారీ ఢీకొని ఇద్దరి మృతి

జగిత్యాల: కోరుట్ల మండలం వెంకటాపూర్ ప్రధాన రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం అతివేగంగా డీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వీరు కొండగట్టుకు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.