గ్యాస్ కొరతపై కేంద్రం కీలక ప్రకటన
వంటగ్యాస్ కొరతపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రశ్నించారు. దీనికి కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి సమాధానం ఇచ్చారు. భారత్‌లో వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదని స్పష్టం చేశారు. గృహ వినియోగదారులకు ఇబ్బంది రాకుంగా చూసుకుంటున్నామని చెప్పారు. గ్యాస్ ఉత్పత్తిపై మార్చి 9న కమిటీ ఏర్పాటు చేశామని వెల్లడించారు.