ఉంగుటూరులో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు
కృష్ణా: ఉంగుటూరు గ్రామంలో ఆదివారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఫాదర్ ఆంథోనీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్సియం చర్చిలో క్రైస్తవులు అందరూ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఫాదర్ ఆంథోనీ మాట్లాడుతూ.. ఈ లోకాన్ని రక్షించడానికి ఏసుక్రీస్తు మానవుడిగా జన్మించారని చెప్పారు. ముఖ్యఅతిథిగా హాజరైన వంశీతో కలిసి కేక్ కట్ చేశారు.