ఖమ్మంలో ముమ్మరంగా పారిశుధ్య పనులు
KMM: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టారు. నగరంలోని ప్రధాన రహదారులు, కాల్వలు, ఉప రహదారుల్లో పొదలు, గడ్డిని తొలగించి, చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేశారు. కాలువలో పేరుకుపోయిన మురికి, చెత్త, మట్టి వంటి అవశేషాలను పూర్తిగా తొలగించారు. పారిశుధ్య పనులను శానిటరీ సూపర్వైజర్ సాంబయ్య పర్యవేక్షించారు.