VIDEO: ‘హోంగార్డ్స్ సంక్షేమానికి పోలీస్ శాఖ కృషి’
AKP: నర్సీపట్నం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇవాళ ఉదయం హోంగార్డ్స్ రోల్ కాల్ పెరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా హోంగార్డ్ ఇంఛార్జ్ చిన్నారావు మాట్లాడుతూ.. పోలీస్ శాఖ హోంగార్డ్స్ సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు హోంగార్డ్స్ ఆరోగ్య పరిరక్షణకు వైద్య శిబిరాలు సైతం ఏర్పాటు చేస్తున్నామన్నారు.