VIDEO: వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించిన పోలీసులు
ప్రకాశం: జరుగుమల్లిలో శనివారం పోలీసులు ద్విచక్ర వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో వాహనదారులకు హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించడం వల్ల కొంతమేరకు రోడ్డు ప్రమాదాలను నివరించవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలను పాటించాలని అన్నారు.