పిడుగుపాటుకు యువకుడు మృతి!
NRPT: పిడుగుపాటుకు గురై శివకుమార్ (18) అనే యువకుడు మృతి చెందడంతో నిడ్జింత గ్రామంలో విషాదం నెలకొంది. మద్దూరు మండలం కంసాన్‌పల్లిలోని బంధువుల పొలానికి వెళ్లిన సమయంలో మంగళవారం సాయంత్రం వర్షంతో పాటు పిడుగు పడటంతో శివకుమార్ అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించాడు.