'బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి'

'బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి'

E.G: కల్తీ పాల ఘటనలో జరిగిన 11 మంది మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని AP PCC అధ్యక్షురాలు షర్మిల రెడ్డి పేర్కొన్నారు. బొల్లినేని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను కాంగ్రెస్ నేతలు జేడీ శీలం, రుద్రరాజుతో కలిసి ఆమె పరామర్శించారు. ప్రాణాలకు భద్రత లేని ప్రభుత్వాలు ఉంటే ఎంత ఊడితే ఎంత అని ఆమె ధ్వజమెత్తారు. మరణించిన వారికి రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాని డిమాండ్ చేశారు.