ఇండోర్ స్టేడియం ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీ పరిశీలన
సత్యసాయి: సత్యసాయి శత జయంతి ఉత్సవాల ఏర్పాట్లలో భాగంగా పుట్టపర్తిలోని ఇండోర్ స్టేడియాన్ని కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్సవాలకు చేపట్టాల్సిన వివిధ అంశాలపై అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. ఈ పరిశీలనలో వారి వెంట జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డీఎస్పీ సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.