టీ20ల్లో అభిషేక్ శర్మే టాప్: మాజీ క్రికెటర్
టీ20ల్లో అభిషేక్ శర్మపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ప్రశంసలు కురిపించాడు. అభిషేక్ సంపూర్ణ ఓపెనర్ అని కొనియాడాడు. అలాగే, అతడు ధైర్యమున్న, నైపుణ్యమున్న బ్యాటర్ అని కితాబిచ్చాడు. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదని చెప్పాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు.