127వ రోజుకు చేరిన రిలే నిరాహారదీక్షలు
NGKL: చారకొండ మండలం ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా వాసులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం 127 రోజులకు చేరుకున్నాయి. R&R ప్యాకేజీ ప్రాథమిక నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించి ఊర్లను ముంపు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.