మాజీ డీజీపీ శ్రీనివాస రెడ్డితో ఎమ్మెల్యే భేటీ
NLR: జిల్లాకు వచ్చిన రిటైర్డ్ డీజీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని జిల్లా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువ, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. ఇవాళ సాయంత్రం కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి రచించిన 'పుంజు తోక' కవితా సంపుటి ఆవిష్కరణ టౌన్ హాల్లో ఉంది. ఈ నేపథ్యంలో రిటైర్డ్ డీజీపీ శనివారం రాత్రి నెల్లూరుకు వచ్చారు.