SC, ST కోర్టు ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రికి వినతి

మంచిర్యాల జిల్లాలో SC, ST కోర్టు ఏర్పాటు చేయాలని జాతీయ SC కమిషన్ సభ్యుడు వి.రామచందర్ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మెఘవాల్‌ను కోరారు. శుక్రవారం ఢిల్లీలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రంలో దళిత, గిరిజన వర్గాలకు చెందిన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. బలహీన వర్గాలకు న్యాయస్థానం అందుబాటులో ఉండే విధంగా జిల్లాలో కోర్ట్ ఏర్పాటు చేయాలన్నారు.