పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
కోనసీమ: అంబాజీపేట మండలం ముక్కామల గ్రామంలోని పశువుల ఆసుపత్రి వద్ద అంబాజీపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశుసంవర్ధక రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిదన్నారు. రైతుల జీవనోపాధికి పశువుల ఆరోగ్యం అత్యంత ముఖ్యమైనదన్నారు.