రేపు మండలంలో డంపు ఇసుక వేలం

WNP: ఖిల్లాఘనపురం మండలంలోని మల్క్ మియాన్‌పల్లి గ్రామ శివారులోని పిల్లివాగులో అక్రమంగా డంపు చేసిన 105 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక వేలాన్ని ఈ నెల 7న ఉదయం 11గంటలకు రెవెన్యూ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ సుగుణ తెలిపారు. ఈ ఇసుకను గత నెల 21న పరిశీలించి సీజ్ చేశామన్నారు. కలెక్టర్ సూచన మేరకు ఎక్కువ ధర ఎవరు చెల్లిస్తారో వారికే ఇసుక ఇస్తామన్నారు.