జెండా దిమ్మలను పరిశీలించిన TDP నేత
కాకినాడ నగరంలోని 7వ వార్డు పరిధిలోని 39, 40, 41 ఫోకస్ బూత్‌లలో ఏర్పాటు చేసిన TDP జెండా దిమ్మలను జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ సిద్ధాంతాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంఛార్జీ అంబటి సత్యనారాయణ, యూనిట్ కన్వీనర్ అంబటి లోవకుమారి, యూనిట్ కో-కన్వీనర్ పొట్నూరి కృష్ణ ప్రసాద్ TDP కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు.