రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
NRML: నిర్మల్ జిల్లా కేంద్రంలో గురువారం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ శ్రీనివాసరావు తెలిపారు. ఆదర్శనగర్ ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతుల దృష్ట్యా వశిష్ట స్కూల్ వెనుక భాగం, శ్రీ చైతన్య స్కూల్, ఆదర్శనగర్ ఏరియాలో పవర్ కట్ చేస్తామన్నారు. ఈ మేరకు వినియోగదారులు సహకరించాలని కోరారు.