'100 కోట్ల భూకబ్జాపై విచారణ జరపాలి'

'100 కోట్ల భూకబ్జాపై విచారణ జరపాలి'

జగిత్యాల పట్టణంలో రూ. 100 కోట్ల భూకబ్జాపై వేగవంతంగా విచారణ జరపాలని జిల్లా మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ దావ వసంత సురేష్ జిల్లా కలెక్టర్‌కు ఇవాళ వినతి పత్రం అందించారు. వారు మాట్లాడుతూ.. కొత్త బస్టాండ్ ప్రాంతంలోని సర్వే నెంబర్ 138లో గల భూమిని పరిరక్షించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.  గత వారం నుంచి ఈ అంశం పట్టణంలో ప్రధాన చర్చగా మారింది.