నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: కూనంనేని
BDK: సుజాతనగర్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పర్యటించారు. మొంథా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, వరదలకు వేలాది ఎకరాల పంటలు దెబ్బతిని రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారని వారు అన్నారు. పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలపై ఉందని స్పష్టం చేశారు.