'అదనపు గదుల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి'
MNCL: భీమారం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో కొనసాగుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని పర్యవేక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.