VIDEO: వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ వేడుక..!
NDL: కొలిమిగుండ్ల మండలం కోరుమానుపల్లె గుండం ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన పట్టాభిరామ ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ వేడుక ఆదివారం ఘనంగా నిర్వహించారు. రెండు రోజులుగా సాగిన ప్రతిష్ఠోత్సవాలు వేకువజామునే ప్రారంభమయ్యాయి. వందలాది మంది భక్తులు జయజయధ్వనుల మధ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.