రేణు అగర్వాల్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

రేణు అగర్వాల్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

TG: కూకట్‌పల్లిలో స్టీల్ వ్యాపారి రాకేశ్ కుటుంబాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరామర్శించారు. స్టీల్ వ్యాపారి భార్య రేణు అగర్వాల్‌ను నిన్న రోషన్, హర్ష దారుణంగా చంపిన విషయం తెలిసిందే. హత్య అనంతరం నిందితులిద్దరూ స్కూటీపై పారిపోయారు. ఇప్పటివరకు నిందితులు పోలీసులకు చిక్కలేదు. అయితే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పోలీసులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.