రూ.4 లక్షల నగదు సీజ్

తూర్పుగోదావరి: గోపాలపురం మండలం జగన్నాధపురంలోని చెక్‌పోస్ట్ వద్ద రూ.4 లక్షల నగదుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఓ వ్యక్తిని చెక్‌పోస్ట్ వద్ద చెక్ చేయగా రూ.4 లక్షల నగదును పట్టుకున్నారు. నగదుకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో వాటిని పోలీసులు సీజ్ చేశారు.