నందవరం KGBV ఘటవపై విచారణ వాయిదా
KRNL: నందవరం కేజీబీవీలో విద్యార్థినులకు బల్లి పడిన కూర వడ్డించారనే వార్తలపై జిల్లా అధికారులు స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సర్వశిక్షా అభియాన్ అడిషనల్ కోఆర్డినేటర్ లోకరాజు పాఠశాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వేసవి సెలవుల కారణంగా విద్యార్థినులు అందుబాటులో లేకపోవడంతో విచారణను వాయిదా వేశారు. పాఠశాల పునఃప్రారంభం అనంతరం కమిటీ వేస్తామన్నారు.