VIDEO: హాస్టల్‌ను పరిశీలించిన జూనియర్ సివిల్ జడ్జ్

ప్రకాశం: ముండ్లపాడులోని గంజి వీరభద్రయ్య జడ్పీ హైస్కూల్ ఆవరణలోని ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్‌లను ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఓంకార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ భవనం మరమ్మత్తులు పూర్తి కాకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టి పూర్తిస్థాయి హాస్టల్ భవనం త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.