'వ్యాధి లక్షణాలు నిర్ధారణ త్వరగా జరిగేలా చూడాలి'
PPM: స్క్రీనింగ్‌లలో వైద్య సిబ్బంది గుర్తించిన వ్యాధి లక్షణాల నిర్ధారణ త్వరగా జరిగేలా వైద్యాధికారులు కార్యాచరణ చేయాలని జిల్లా ఆర్.బి.ఎస్.కె అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు స్పష్టం చేశారు. నీలకంఠపురం గ్రామంలో సంచార చికిత్స శిబిరాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి శ్రీకాంత్ పాల్గొన్నారు.