ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో

MDK: టేక్మాల్ మండల కేంద్రంలోని పంతుల్ చెరువులో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీవో విట్టల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలతో ఆయన మాట్లాడారు. ఫీల్డ్ అసిస్టెంట్ రాములుతో ఉపాధి పని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే కూలీల మస్టర్‌ను పరిశీలించి వారి సంతకాలు సేకరించారు. ఉపాధి హామీ పనుల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని సూచించారు.