'మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు'

ELR: జంగారెడ్డిగూడెం పట్టణ పోలీసులు శనివారం వాహన తనిఖీలు నిర్వహించచారు. ఈ సందర్భంగా వాహనాలను నడుపుతున్న మైనర్‌లకు సీఐ వీ.కృష్ణబాబు కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్లకు వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.