కందుకూరులో వాహనదారులు జాగ్రత్త..!

NLR: కందుకూరు పట్టణం కనిగిరి రోడ్డు దూబగుంట RTO ఆఫీస్ దగ్గర ఉన్న బ్రిడ్జికి పెద్ద రంధ్రం పడింది. అక్కడ కొన్ని నెలలుగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మంగళవారం ఒక వాహనం ప్రమాదానికి గురైంది. అదే బ్రిడ్జి దగ్గర ఇవాళ సాయంత్రం మరో పెద్ద రంధ్రం ఏర్పడింది. రాత్రిపూట వెళ్లే వాహనదారులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. అధికారులు స్పందించి మరమ్మత్తులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.