ఎంపీతో మున్సిపల్ ఛైర్ పర్సన్ చర్చలు
MDK: మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావును రామాయంపేట మున్సిపల్ ఛైర్ పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్యే రోహిత్ రావు ఆదేశాల మేరకు ఎంపీని కలిసి రామాయంపేట పట్టణ సుందరీకరణ, అభివృద్ధి పనులపై చర్చించారు. ప్రధానంగా రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.