కృష్ణానదిలో తేలియాడుతున్న మృతదేహం

కృష్ణానదిలో తేలియాడుతున్న మృతదేహం

ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. ఈ రోజు మధ్యాహ్నం కృష్ణానది మధ్యలో తేలియాడుతున్న ఓ వ్యక్తి శవాన్ని ఎస్ డి ఆర్ ఎఫ్ బలగాలు గుర్తించాయి. మృతదేహాన్ని తాడు సహాయంతో బయటకి తీసుకొచ్చారు. అనుమానాస్పద స్థితిలో ఉండటంతో ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.